పోలీస్ స్టేషన్ ఆవరణలో కత్తిపోట్ల కలకలం
సూర్య, మాక్లూర్ ::మాక్లూర్ మండలం మాణిక్ భండార్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య రూ.10 వేల బాకీ విషయంలో తలెత్తిన వివాదం కత్తిపోట్లకు దారితీసింది. శంకర్ అనే వ్యక్తి తనకు రావాల్సిన రూ.10 వేల బాకీ డబ్బుల విషయమై పలుమార్లు వినయ్‌ను అడగడంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం.ఈ క్రమంలో ఇద్దరూ పరస్పరం దాడులకు దిగడంతో ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. ఈ ఘటనలో శంకర్ కత్తితో వినయ్‌పై దాడి చేయడంతో కత్తిపోట్ల కలకలం రేగింది. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.గాయపడిన వినయ్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఎస్ఐ అనిల్ రెడ్డీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.