కరువు నేపథ్యంలో పంట నష్టం వివరాల నమోదు
రైతులు వెంటనే స్పందించాలి_
ఏవో అనిల్
లింగాల: ఇటీవల ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించిన నేపథ్యంలో లింగాల మండలంలోని గ్రామాల్లో పంట నష్టం వివరాల నమోదు ప్రక్రియను వ్యవసాయ శాఖ చేపట్టిందని మండల వ్యవసాయ అధికారి అనిల్ తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ విస్తరణ అధికారులు ( ఏఈఓలు) క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి, పంట నష్టం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారని వెల్లడించారు.పంట నష్టం వివరాల నమోదు చేసుకోవడానికి ఈ నెల 9 వ తేదీ చివరి గడవని అన్నారు.పంట నష్టం వివరాల నమోదు కోసం సమయం తక్కువగా ఉన్నందున రైతులందరూ వెంటనే స్పందించాలనీ అన్నారు. కావున పంట నష్టం జరిగిన రైతులు స్వయంగా తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారిని (ఏఈఓ) కలిసి, అధికారిని తమ పంట పొలానికి తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలన చేయించి, వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలన్నారు.ముఖ్యంగా రైతుల పంట వివరాలు డిజిటల్ క్రాప్ బుకింగ్ లో తప్పనిసరిగా నమోదై ఉండాలి. అలాగే పంట నష్టం పరిశీలన సమయంలో పొలంలో పంట తప్పనిసరిగా ఉండాలి. క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగానే పంట నష్టం వివరాలు నమోదు చేయడం జరుగుతుందన్నారు.రైతులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వెంటనే సంబంధిత ఏఈఓ లను సంప్రదించి, నవంబర్ 9వ తేదీలోపు పంట నష్టం వివరాలను నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి కోరారు.