కారులో మంటలు చెలరేగి వ్యక్తి దుర్మరణం*
*కారులో మంటలు చెలరేగి వ్యక్తి దుర్మరణం*
*మాడ్గుల మండలం ఫకీరాతాండ సమీపంలో ఘటన*
మాడ్గుల (రంగారెడ్డి)
కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి 35యేండ్ల వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం ఉదయం మాడ్గుల మండలం ఫకీరాతాండ గ్రామ పంచాయతీ పరిధిలోని వాల్యతాండ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పకీరాతాండకు చెందిన జర్పుల సంతోష్ (35) అనే వ్యక్తి శుక్రవారం ఉదయం తన ఆల్టో కారులో వ్యవసాయపొలం వద్దకు వెళ్తూ వాల్యతాండ సమీపంలో అప్పారెడ్డిపల్లి- పకీరాతాండ బిటి రోడ్డు పక్కన కారును ఆపగా అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగడంతో సంతోష్ పూర్తిగా కాలిపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు హైదరాబాద్ లో జీవనం సాగిస్తూ గురువారం రాత్రి సొంత తండాకు వచ్చి ఉదయం తన పొలం వద్దకు వెళుతూ ప్రమాదానికి గురైనట్లు వివరించారు. మృతుడికి భార్య జ్యోతి, ఇద్దరు కుమారులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి వుంది.
-------
ఆర్.నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల