BREAKING
ఎక్స్ (X) డిజిటల్ రైట్స్ గ్రూప్‌లను టార్గెట్ చేస్తూ వచ్చిన టేక్‌డౌన్ నోటీసులు బూటకం మంత్రి నారాయణ వ్యూహాత్మక అడుగులు నెల్లూరు పీఠంపై కూటమి జయభేరి... ఎం&ఎం క్యూ2 ఫలితాల్లో జోరు: మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్ వ్యూ ఎవోస్ కొనుగోలుతో అదానీ పోర్ట్స్‌పై మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మేయర్ రమేష్ గౌడ్ ప్రత్యేక పూజలు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ క్యూ2 సమీక్ష: 15 టాప్ స్టాక్స్ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యం: మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న వేణుగోపాల్ ధూత్‌ను బ్యాంక్రప్ట్‌గా ప్రకటించిన ఎన్‌సీఎల్‌టీ పోలీస్ స్టేషన్ ఆవరణలో కత్తిపోట్ల కలకలం క్యూ2 నిరాశతో థెర్మాక్స్ షేర్లలో భారీ అమ్మకాలు దేశంలో రెండో స్థానానికి ఏంజెల్ వన్.. క్యూ2 లాభాల్లో 58% వృద్ధి మనీష్ మల్హోత్రా దివాలి పార్టీలో ఐశ్వర్య-అభిషేక్: చేతిలో చెయ్యేసి గ్రాండ్ ఎంట్రీ! ఈ వారం మార్కెట్ టాకింగ్ పాయింట్స్ థానేలో చెట్లకు దీపావళి లైట్లంకరణపై వివాదం పీఎల్ క్యాపిటల్ క్యూ2 సమీక్ష: ఫ్రాక్టల్ అనలిటిక్స్ టార్గెట్ ప్రైస్

పొన్నూరు ఎస్‌బీఐ లో ఒక్క కౌంటరే దిక్కు, గంటల తరబడి క్యూలో వినియోగదారులు

Select Suryaa Now
పొన్నూరు ఎస్‌బీఐ లో ఒక్క కౌంటరే దిక్కు, గంటల తరబడి క్యూలో వినియోగదారులు

 పొన్నూరు మేజర్ న్యూస్:-పొన్నూరు పట్టణం  లోని ఎస్‌బీఐ బ్యాంకు నందు నగదు లావాదేవీల కోసం ఒక్క కౌంటర్ మాత్రమే ఉండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగదు జమ చేయడానికి, తీసుకోవడానికి వచ్చే వారంతా ఒకే క్యూలో గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.ఉదయం వచ్చిన వారికి మధ్యాహ్నం వరకు పని పూర్తి కావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో ఈ ఇబ్బంది మరింత పెరుగుతోంది. ముఖ్యంగా పెన్షన్ తీసుకోవడానికి వచ్చే వృద్ధులు అష్టకష్టాలు పడుతున్నారు. వయసు మీద పడిన వారు , క్యూలో ఎక్కువ సేపు నిలబడలేక అవస్థలు పడుతున్నారు. వారికి కనీసం కూర్చునే సదుపాయం కూడా సరిగా లేకపోవడంతో ఇబ్బంది మరింత పెరుగుతోందని వృద్దులు చెబుతున్నారు.దీనిపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. నగదు లావాదేవీల కోసం మరో కౌంటర్ ఏర్పాటు చేయాలని, వృద్ధులు, పెన్షనర్ల కోసం రెండవ  కౌంటర్ ను ఏర్పాటు చేయవలసిందిగా  కోరుతున్నారు.