మంత్రి నారాయణ వ్యూహాత్మక అడుగులు నెల్లూరు పీఠంపై కూటమి జయభేరి...
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీ ఏర్పడిన మంత్రి నారాయణ ఎన్నికల్లో రచించిన వ్యూహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఎన్నికలు పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న ఆయన ఎన్నికలలో రచించిన వ్యూహాలతో సిటీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు మంచి విజయం సాధించారు క్షేత్రస్థాయిలో ఆయన కుటుంబ సభ్యుల అవిశ్రాంత ప్రచారం వెరసి నెల్లూరు కార్పొరేషన్‌ను కూటమి వశం చేశాయి. ఓటర్ల అపూర్వ నీరాజనాలతో, నగరం అంతా ఏకమై పట్టం కట్టడంతో, ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఈ విజయం నిలిచింది. ఇక ఎన్నికల పోరులో మంత్రి నారాయణ చూపిన పరిణితి, నెల్లూరు అభివృద్ధికి ఆయన చేసిన కృషి ప్రజల్లో చెరగని ముద్ర వేసింది. ఫలితంగా, ప్రతిష్టాత్మకమైన నెల్లూరు కార్పొరేషన్‌లో కూటమి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే కోల్పోయిన కూటమి, నెల్లూరు రాజకీయాల్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది..