BREAKING
బీజేపీ నేత సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని కలిసిన నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పోరాటంపై కోటంరెడ్డి ప్రశంసలు నన్ను నమ్ముకుని నడిచిన చిన మస్తాన్‌కు అధికార పార్టీ నుంచి అవకాశం కల్పించలేకపోయాను: ఎమ్మెల్యే కోటంరెడ్డి కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి షురూ: త్వరలోనే వివాహ బంధంలోకి కావ్య కల్యాణ్ రామ్, కాల భైరవ! మంత్రిని కలిసిన మేయర్ రూప్ కుమార్ యాదవ్ 30వ డివిజన్ విజేతకు ఎమ్మెల్యే అభినందనలు ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఘోర ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి దుర్మరణం వరుణ్ సందేశ్ 'యద్భావం తద్భవతి' టీజర్ విడుదల: లాంచ్ చేసిన ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్! వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య బాక్సాఫీస్ వద్ద సూర్య హ్యాట్రిక్ విజయం: 'సీన్' సినిమాకు అద్భుతమైన స్పందన! “విద్య – వసతి – వికాసం” కార్యక్రమానికి రూ.10 లక్షల విరాళం రజనీకాంత్ పాత సినిమా టైటిల్‌తో సంతానం కొత్త ప్రయోగం: టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో 'అదిశయ పిరవి'! డీసీసీబీ ధనవృద్ధి సహకార డిపాజిట్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి..........బ్రాంచ్ మేనేజర్ వి. కీర్తి సుధ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి.. అశ్వారావుపేట పోలీసుల అవగాహన!* కొర్ర ద్వాదశి సందర్భంగా గోమాతకు పూజలు

పెదవోగిరాలలో టీడీపీ కార్యకర్తలపై దాడి.. వైసీపీపై మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆగ్రహం

Select Suryaa Now
పెదవోగిరాలలో టీడీపీ కార్యకర్తలపై దాడి.. వైసీపీపై మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆగ్రహం

ఉయ్యూరు రూరల్, మేజర్ న్యూస్: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉయ్యూరు రూరల్ మండలం పెదవోగిరాల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై దాడి ఘటనను మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ తీవ్రంగా ఖండించారు. గ్రామానికి వెళ్లి పరిస్థితులను సమీక్షించి, బాధిత కార్యకర్తలు, పార్టీ నాయకులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ఏసుబాబును పరామర్శించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వైసీపీ నాయకులు ఓటమి భయంతో గ్రామాల్లో గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంతంగా ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు దిగడం దారుణమన్నారు. పెదవోగిరాలలో టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి గాయపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.