BREAKING
విధి నిర్వహణలో మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబానికి ₹1 కోటి చెక్కు పంపిణీ -జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమిది చారిత్రాత్మక విజయం పెదవోగిరాలలో టీడీపీ కార్యకర్తలపై దాడి.. వైసీపీపై మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆగ్రహం ఎన్నికల్లో గెలిచినా విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు రైస్ మిల్లుల వద్ద రోజుల తరబడి పడిగాపులు.. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం ఒత్తిడి చేస్తేనే ధర పెంపునకు అంగీకారం.. అకాల గాలివానలతో ఇప్పటికే నష్టాల్లో అన్నదాతలు మిల్లర్ల తీరుపై రైతుల ఆగ్రహం.. అధికారుల పర్యవేక్షణ ఏదీ? టిడిపిబీసీ నేతపై వైసీపీ నాయకులు దాడి అఖిలభారత రైతు మహా సభలను జయప్రదం చేయండి పాంచాలి నగర్ అంగన్వాడీ కేంద్రం వద్ద చెత్త కుప్పలు. మహిళలపై దాడిని ఖండిస్తూ శాలిగౌరారం మండల పాస్టర్స్ ఫెలోషిప్ నిరసన దక్షిణ ఆఫ్రికా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎఎన్‌సి (ANC) కి భారీ షాక్ తుర్కియేలో మాజీ మంత్రికి జైలు శిక్ష ఉక్రెయిన్‌లో వందలాది హోటళ్లను అక్రమంగా స్వాధీనం చేసుకున్న రష్యా ఎక్స్ (X) డిజిటల్ రైట్స్ గ్రూప్‌లను టార్గెట్ చేస్తూ వచ్చిన టేక్‌డౌన్ నోటీసులు బూటకం మంత్రి నారాయణ వ్యూహాత్మక అడుగులు నెల్లూరు పీఠంపై కూటమి జయభేరి... ఎం&ఎం క్యూ2 ఫలితాల్లో జోరు: మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్ వ్యూ

రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మేయర్ రమేష్ గౌడ్ ప్రత్యేక పూజలు

Select Suryaa Now
రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మేయర్ రమేష్ గౌడ్ ప్రత్యేక పూజలు

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : అనంతపురం నగర శివారులోని రాయల్ నగర్‌లో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ చిట్లూరు రమేష్ గౌడ్ సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి నగర ప్రజల సంక్షేమం, తన పాలనా బాధ్యతల కోసం దైవాన్ని ప్రార్థించారు.

ఈ సందర్భంగా ఆలయ పూజారులు వేద మంత్రోచ్చారణలతో పూజలు నిర్వహించి మేయర్ రమేష్ గౌడ్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో నగరంలో అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేసేందుకు సంకల్పించానని ఆయన తెలిపారు.

ఆలయ దర్శనం అనంతరం మేయర్ రమేష్ గౌడ్ ఈడిగ గౌడ సంఘం నాయకులు, సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధి, స్థానిక సమస్యలు, సామాజిక సంక్షేమం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

గౌడ సంఘం నాయకులు మేయర్‌గా రమేష్ గౌడ్ విజయానికి అభినందనలు తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని వారు కోరారు.  

రిపోర్టర్ : మొయిలుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్.