విద్యుత్ షాక్‌తో 10 నెలల చిన్నారి మృతి
సూర్య ఎండపల్లి:ఎండపల్లి మండలంలోని రాజరాం పల్లి లో విద్యుత్ రూపంలో మృత్యువు పసిప్రాణాన్ని బలిగొంది. ఇంట్లో ఆడుకుంటూ చార్జింగ్ పెట్టిన విద్యుత్ కాంటా, ( తూకం వేసే పరికరం )ను తాకడంతో 10 నెలల చిన్నారి విభూది ఆద్య విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు సమాచారం. ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుడే లోకాన్ని చూడటం ప్రారంభించిన పసిపాప అకాల మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.