12వ డివిజన్ సమస్యలపై అధికారులకు కార్పొరేటర్ వినతి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారుల హామీ
సూర్య మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డివిజన్ కార్పొరేటర్ కస్తూరి నాగరాజు మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ వైకుంఠం,సంబంధిత అధికారులను కలిసి డివిజన్‌లో నెలకొన్న సమస్యలను వివరించారు.ముఖ్యంగా పారిశుధ్య కార్మికుల కొరత కారణంగా వీధుల పరిశుభ్రతకు ఆటంకం కలుగుతోందని, కోతులు, వీధి కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.అదేవిధంగా డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందని,మురుగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైన చోట డ్రైనేజీ నాలాలు నిర్మించాలని అధికారులను కోరారు.ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.కార్పొరేటర్ వివరించిన సమస్యలపై స్పందించిన మున్సిపల్ అధికారులు వాటిని నమోదు చేసుకుని,సంబంధిత విభాగాల ద్వారా పరిశీలించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.