BREAKING
ఎక్స్ (X) డిజిటల్ రైట్స్ గ్రూప్‌లను టార్గెట్ చేస్తూ వచ్చిన టేక్‌డౌన్ నోటీసులు బూటకం మంత్రి నారాయణ వ్యూహాత్మక అడుగులు నెల్లూరు పీఠంపై కూటమి జయభేరి... ఎం&ఎం క్యూ2 ఫలితాల్లో జోరు: మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్ వ్యూ ఎవోస్ కొనుగోలుతో అదానీ పోర్ట్స్‌పై మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మేయర్ రమేష్ గౌడ్ ప్రత్యేక పూజలు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ క్యూ2 సమీక్ష: 15 టాప్ స్టాక్స్ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యం: మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న వేణుగోపాల్ ధూత్‌ను బ్యాంక్రప్ట్‌గా ప్రకటించిన ఎన్‌సీఎల్‌టీ పోలీస్ స్టేషన్ ఆవరణలో కత్తిపోట్ల కలకలం క్యూ2 నిరాశతో థెర్మాక్స్ షేర్లలో భారీ అమ్మకాలు దేశంలో రెండో స్థానానికి ఏంజెల్ వన్.. క్యూ2 లాభాల్లో 58% వృద్ధి మనీష్ మల్హోత్రా దివాలి పార్టీలో ఐశ్వర్య-అభిషేక్: చేతిలో చెయ్యేసి గ్రాండ్ ఎంట్రీ! ఈ వారం మార్కెట్ టాకింగ్ పాయింట్స్ థానేలో చెట్లకు దీపావళి లైట్లంకరణపై వివాదం పీఎల్ క్యాపిటల్ క్యూ2 సమీక్ష: ఫ్రాక్టల్ అనలిటిక్స్ టార్గెట్ ప్రైస్

హకింపేట్ ఎడ్యుకేషనల్ హబ్‌లో వలస కూలీల కన్నీటి గోడు.. కూలి డబ్బుల కోసం ఆందోళన

Select Suryaa Now
హకింపేట్ ఎడ్యుకేషనల్ హబ్‌లో వలస కూలీల కన్నీటి గోడు.. కూలి డబ్బుల కోసం ఆందోళన

దుద్యాల, మేజర్ న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో వలస కూలీలు కూలి డబ్బుల కోసం ఆందోళనకు దిగారు. దుద్యాల మండలం పోలేపల్లిలో నిర్మిస్తున్న ఎడ్యుకేషనల్ హబ్ పనుల్లో పనిచేస్తున్న వలస కూలీలు తమకు రావాల్సిన కూలి డబ్బులను KLSR కన్‌స్ట్రక్షన్స్ సంస్థ చెల్లించడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు.రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నా తమ శ్రమకు తగిన ప్రతిఫలం అందడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో తమ కుటుంబాలకు డబ్బులు ఎలా పంపించాలని ప్రశ్నించారు. స్వగ్రామాల్లో ఉన్న కుటుంబ సభ్యులు పండుగ కోసం ఎదురుచూస్తుంటే, ఇక్కడ తమకు కూలి డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కన్నీటిపర్యంతమయ్యారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన నేపథ్యంలో తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరుతామని వలస కూలీలు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత కాంట్రాక్ట్ సంస్థ స్పందించి తమకు రావాల్సిన కూలి డబ్బులను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.