పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సవిత* *ఎస్వీఆర్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను పరిశీలించిన మంత్రి సవిత*
పెనుకొండ పట్టణంలోని ఎస్వీఆర్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) మంజూరైన నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులతో మాట్లాడి పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలని, ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అర్హులైన పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్టీఆర్ వైద్య సేవల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం విలేజ్ హెల్త్ క్లినిక్‌లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని వివరించారు. ప్రజలు ఎన్టీఆర్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకుని మెరుగైన వైద్య చికిత్సలు పొందాలని మంత్రి సవిత సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…