జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్.. 11 గంటలకు 21.18 శాతం నమోదు
విజయవాడ, మేజర్ న్యూస్: ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టింది. కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సరళిని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల రద్దీ, పోలింగ్ నిర్వహణ తీరు, సిబ్బంది పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నారు. గురువారం ఉదయం 11 గంటల సమయానికి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 21.18 శాతం పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ వెల్లడించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు కీలకమని, అర్హులైన ఓటర్లందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ప్రలోభాలకు, అపోహలకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.