స్థానిక ఎన్నికల పోలింగ్ సరళిని స్వయంగా పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి...
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ZPTC/MPTC స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో పోలింగ్ సరళిని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా పరిశీలిస్తున్నారు. 05-11-2026 ఏఎస్‌పేట మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక నాయకులతో గ్రామ రచ్చబండ పై చర్చిస్తూ ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్ సరళి, ఓటింగ్ శాతం, పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామాలవారీగా పోలింగ్ జరుగుతున్న తీరును స్థానిక నాయకులతో చర్చించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని సూచించారు.