విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
సూర్య- బిక్కనూర్ ;;విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చదువుపై,ఇంటి వద్ద ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మండల విద్యా వనరుల అధికారి రాజగంగారెడ్డి చెప్పారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు పలు సూచనలు సలహాలు చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను విద్యార్థులకు ఇంటి వద్ద తల్లిదండ్రులు క్షుణ్ణంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.