సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి సీనియర్ జర్నలిస్టు విరాళం
సూర్య- బిక్కనూర్ :మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి, మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ దన్నారపు రాజలింగం గురువారం 11వేల రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యుడు, మాజీ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తక్కల్ల నర్సారెడ్డికి అందజేశారు. ఆలయ నిర్మాణంలో తన వంతు భాగస్వామ్యం కావడం తన అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యుడు రెడ్డిగారి నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు