పదవీ ప్రమాణస్వీకారానికి ముందే..సింగిల్ విండో డైరెక్టర్ పదవికి రాజీనామా యోచనలో కొండల్ రెడ్డి..?*
*పదవీ ప్రమాణస్వీకారానికి ముందే..సింగిల్ విండో డైరెక్టర్ పదవికి రాజీనామా యోచనలో కొండల్ రెడ్డి..?*
*మాడ్గుల సింగిల్ విండో చైర్మన్ పదవిని ఆశించినప్పటికి అనూహ్యంగా డైరెక్టర్ల లిస్టులో ఆయన పేరు ఉండడాన్ని ఎస్.కె.ఆర్ అభిమానుల్లో నిరాశ*
*వ్యక్తిగత కారణాలతోనే సింగిల్ విండో డైరెక్టర్ పదవికి రాజీనామా చేయనున్నారని ఆయన అభిమానుల వెల్లడి*
మాడ్గుల ( రంగారెడ్డి)
మాడ్గుల సింగిల్ విండో చైర్మన్ తో పాటు 12 మంది సభ్యుల పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన విషయం విధితమే. అయితే మాడ్గుల మండలకేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత సూధిని వెంకట్ రామ్ రెడ్డి ( కొండల్ రెడ్డి) గతకొంత కాలంగా సింగిల్ విండొ చైర్మన్ పదవి కొరకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, తెలంగాణ గ్రామపంచాయతి ట్రిబ్యునల్ చైర్మన్ సూధిని రాంరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు భట్టు కిషన్ రెడ్డిల సమక్షంలో గట్టిగానే ప్రయత్నించారు. కాగా బుధవారం అధికారికంగా విడుదలైన జాబితాలో ఆయన పేరు డైరెక్టర్ల లిస్టులో ఉండడం పట్ల సూధిని కొండల్ రెడ్డితో పాటు ఆయన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో ఆయన పదవీ ప్రమాణస్వీకారానికి ముందే ఆ పదవికి రాజీనామా చేయనున్నారని వినికిడి. ఈ నేపధ్యంలో గురువారం ఆయన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసి మాడ్గుల సింగిల్ విండో డైరెక్టర్ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. ఇదిలా వుండగా మాడ్గుల సింగిల్ విండోకు అధికారులు విడుదల చేసిన జాబితాలో ఎమ్మెల్యే కసిరెడ్డి తన మార్క్ చూపి స్థానికంగా భట్టు, సూధిని వర్గాలకు చెక్ పెట్టినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా మండలంలో కొన్ని గ్రామాలలో సింగిల్ విండో డైరెక్టర్ పదవులకు అభ్యర్థుల ఎంపిక విషయం ఆ గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లకు గాని పాత కాంగ్రెస్ సీనియర్లకు గాని కనీస సమాచారం ఇవ్వలేదని, పార్టీ కొరకు రాత్రింబవళ్ళు తేడా లేకుండ కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కాదని చాల వరకు గులాభి గూటి నుండి కాంగ్రెస్ లో చేరినవారికే సింగిల్ విండో నామినేటెడ్ పదవులు కట్టబెట్టారని మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణులకు ఆమోదయోగ్యం కాకుండ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోవు స్థానిక ఎన్నికల్లో మాడ్గుల మండలంలో కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.
----------
ఆర్.నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల