పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తహసీల్దార్.
ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు ప్రజల సహకరించాలి.
పోలింగ్ బూత్ లను పరిశీలించిన తహసిల్దార్ రజిని.
25 శాతం పోలింగ్.
సూర్య న్యూస్ ముండ్లమూరు. ప్రశాంతంగా పోలింగ్ జరిగినందుకు ప్రజల సహకరించాలని తహసీల్దార్ రజనీ కోరారు. జడ్పిటిసి ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. మండలంలో 56 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 45,830 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా బార్లు తీరారు. 9 గంటలకు 25 శాతం పోలింగ్ నమోదయింది.