విజయనగర కాలనీలో 35 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్
విజయనగర కాలనీలో 35 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్
* తుఫాను ప్రభావంతో విద్యుత్ అంతరాయం
* కిటికీల వెలుతురులోనే ఓటు హక్కు వినియోగం
- చీరాల: చీరాల నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే రాత్రి నుంచి కురిసిన వర్షం, తుఫాను ప్రభావంతో చీరాల మండలం విజయనగర కాలనీలో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. విద్యుత్ అంతరాయం కారణంగా ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ 7.38 గంటలకు మొదలైంది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో పోలింగ్ కేంద్రంలో కిటికీల నుంచి వచ్చే సహజ వెలుతురులోనే అధికారులు పోలింగ్ ప్రక్రియను కొనసాగించారు. ఓటర్లు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.