BREAKING
ఇరాన్‌కు సహకరించిన భారత దంపతులపై అమెరికా ఆంక్షలు ఢిల్లీ జడ్జిపై వ్యాఖ్యలు: రత్నా సింగ్‌పై కోర్టు ధిక్కార చర్యలు కళ్యాణదుర్గం వైఎస్ఆర్సిపి జెడ్పిటిసి అభ్యర్థి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల మండల జడ్పిటిసి ఎన్నికల్లో బారులు తీరిన ఓటర్లు.. యూఎస్ మధ్యంతర ఫలితాలు: పుంజుకున్న గ్లోబల్ మార్కెట్లు మలయనూరులో ఓటు హక్కు వినియోగించుకున్న జడ్పిటిసి అభ్యర్థి కేస్ కే శ్రీదేవి. ట్రంప్ ఎదురుదెబ్బ: భారత్, పాక్‌లపై ప్రభావం ఏమిటి? సనత్ నగర్‌లో మురికినీటి తిప్పలు: జలమండలి ఎండితో మర్రి శశిధర్ రెడ్డి భేటీ ఓటమికి ఇరాన్ యుద్ధమే కారణం: డొనాల్డ్ ట్రంప్ ఉద్యోగులకు ఐఫోన్ 16 దీపావళి గిఫ్ట్: ఢిల్లీ కంపెనీ హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న ఇటలీ జంట భారతీయులపై విద్వేష వ్యాఖ్యలు: టెక్సాస్ ఎన్నికల్లో రిపబ్లికన్ నేత ఓటమి ఉమెన్స్ టీ20 ట్రోఫీ ఎలైట్ టోర్నమెంట్‌లో ఘన విజయంతో ముగిసిన హైదరాబాద్ జట్టు ప్రయాణం రెడ్ స్టేట్స్ ఎలా బ్లూగా మారాయి?: డెమొక్రాట్ల చారిత్రక విజయం దొంగ నా కొడుకు సినిమాలో క్యూట్ అండ్ బబ్లీ రోల్ చేశా.. హీరోయిన్ సుష్మితా శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు!

కళ్యాణదుర్గం వైఎస్ఆర్సిపి జెడ్పిటిసి అభ్యర్థి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Select Suryaa Now
కళ్యాణదుర్గం వైఎస్ఆర్సిపి జెడ్పిటిసి అభ్యర్థి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కళ్యాణదుర్గం: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని కళ్యాణదుర్గం జడ్పీటీసీ అభ్యర్థి ఎర్రంపల్లి కృష్ణమూర్తి భార్య కృష్ణవేణి పేర్కొన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆమె సంబంధిత పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు ప్రజలకు తమ ప్రతినిధులను ఎన్నుకునే గొప్ప అవకాశమని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాకుండా పౌరుల సామాజిక బాధ్యత కూడా అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పనలో స్థానిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ఓటర్లు అభ్యర్థుల పనితీరు, ప్రజలకు అందుబాటులో ఉండే స్వభావం, అభివృద్ధిపై వారి నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని తమ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా మహిళలు, యువత ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొని ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ పాటిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కృష్ణవేణి విజ్ఞప్తి చేశారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.