పులివెందుల మండల జడ్పిటిసి ఎన్నికల్లో బారులు తీరిన ఓటర్లు..
పులివెందుల మేజర్ న్యూస్ :
పులివెందుల మండల పరిధిలోని నల్లపురెడ్డిపల్లె గ్రామంలో జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా స్వచ్ఛందంగా పోలింగ్‌లో పాల్గొంటూ ప్రజాస్వామ్య ప్రక్రియలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. గ్రామంలో ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనడంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది.
పి కృష్ణ. పులివెందుల స్టాఫ్ రిపోర్టర్ కడప జిల్లా