పోలింగ్ స్టేషన్ లు పరిశీలించిన ఎం ఆర్ ఓ
పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన ఎంఆర్ఓ ఎస్. శిరీష
ఓటర్లంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి – ఎంఆర్ఓ
జగ్గయ్యపేట రూరల్, నవంబర్ 5:
ఎన్నికల నిర్వహణలో భాగంగా జగ్గయ్యపేట మండలం షేర్ మొహమ్మద్ పేట గ్రామంలోని వివిధ పోలింగ్ స్టేషన్లను ఎంఆర్ఓ ఎస్. శిరీష పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు.
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా తమకు నచ్చిన అభ్యర్థికి స్వేచ్ఛగా ఓటు వేయాలని సూచించారు.