కృష్ణా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభం
కృష్ణా జిల్లా, మేజర్ న్యూస్: జిల్లాలోని 26 జెడ్పీటీసీ, 352 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 1,266 పోలింగ్ కేంద్రాల్లో గురువారం ఉదయం స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డి.కె. బాలాజీ పర్యవేక్షణలో ఎన్నికల యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఎన్నికల విధుల్లో నిమగ్నమైన అధికారులు, సిబ్బంది సమన్వయంతో పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా కొనసాగుతోంది.
ప్రతి ఓటరు ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ విజ్ఞప్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.