ఎన్టీఆర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఎన్టీఆర్ జిల్లా, మేజర్ న్యూస్: జిల్లాలోని 16 జెడ్పీటీసీ, 276 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 992 పోలింగ్ కేంద్రాల్లో గురువారం ఉదయం స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పర్యవేక్షణలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది.
ప్రజలందరూ ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విజ్ఞప్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.