BREAKING
దేవరయాంజల్‌లో 1,220 ప్లాట్ల నకిలీ పట్టాల వ్యవహారం.. సమగ్ర విచారణకు మహిపాల్ రెడ్డి డిమాండ్ వ్యర్థాల తొలగింపు ద్వారా రూ.61.41 కోట్లు ఆర్జించిన కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ టెలికాం వినియోగదారులకు గుడ్‌న్యూస్-నెట్‌వర్క్ అనుభవ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించిన ట్రాయ్ ఇరాన్‌పై యుద్ధం సమర్థనీయమే: డొనాల్డ్ ట్రంప్ ఐడీబీఐ బ్యాంక్ వాటా విక్రయంపై దేశంలో తీవ్ర చర్చ చంద్రుడిపై ఆధిపత్య పోరు: భారత్ ముందున్న సవాళ్లు 5 దేశాల్లో ఉద్యోగులకు గూగుల్ వీఈపీ ఆఫర్ శరద్ పవార్‌కు మోదీ ఫోన్: సుప్రియా సూలేపై కీలక వ్యాఖ్యలు ఇరాన్ యుద్ధమే రిపబ్లికన్ల ఓటమికి కారణం: జేడీ వాన్స్ నేడు మార్కెట్లో కొనుగోలుకు టాప్-5 షేర్లు (5 నవంబర్ 2026) ముడిచమురు ధరల్లో భారీ పతనం: $95 దిగువకు బ్రెంట్ క్రూడ్ ఎస్‌జీబీలు: గడువు వరకు ఉంచాలా? ముందే విక్రయించాలా? నేటి స్టాక్ మార్కెట్: ట్రేడింగ్ ముందు తెలుసుకోవాల్సిన అంశాలు అగ్నివీర్లకు శాశ్వత సర్వీసు: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం ఆల్‌కార్గో లాజిస్టిక్స్ క్యూ2 ఫలితాలు: రూ.19 కోట్ల నికర లాభం

దేవరయాంజల్‌లో 1,220 ప్లాట్ల నకిలీ పట్టాల వ్యవహారం.. సమగ్ర విచారణకు మహిపాల్ రెడ్డి డిమాండ్

Select Suryaa Now
దేవరయాంజల్‌లో 1,220 ప్లాట్ల నకిలీ పట్టాల వ్యవహారం.. సమగ్ర విచారణకు మహిపాల్ రెడ్డి డిమాండ్

శామీర్‌పేట, మేజర్ న్యూస్ : దేవరయాంజల్ భూ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గ్రామంలోని సర్వే నంబర్లు 682, 684, 685 పరిధిలో ఫేజ్-1, ఫేజ్-2కు సంబంధించి 1,220 ప్లాట్లకు నకిలీ పట్టాలు సృష్టించి క్రయవిక్రయాలు జరిపినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నకిలీ పట్టాల తయారీ, విక్రయాల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించాలని, పంచాయతీ లేఅవుట్లలోని పార్కు స్థలాల ఆక్రమణలపై కూడా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్‌ను వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు మహిపాల్ రెడ్డి తెలిపారు. దీంతో దేవరయాంజల్ భూ వ్యవహారంపై అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. 1,220 ప్లాట్ల నకిలీ పట్టాల వ్యవహారంలో బాధ్యులు ఎవరు? ప్రభుత్వ భూములు, పార్కు స్థలాల ఆక్రమణల వెనుక ఉన్నవారెవరు? విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

రిపోర్టర్: తాటికొండ రవి గౌడ్, ఉమ్మడి షామీర్పేట్, మేడ్చల్ జిల్లా.