వరద ముంపులో అశ్వారావుపేట..
సూర్య,అశ్వారావుపేట,తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు అశ్వారావుపేట పట్టణం జలమయమైన నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళమ్మ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ యువ నేత జూపల్లి ప్రమోద్ రంగంలోకి దిగారు.
మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించి, వర్ష ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు.
*ప్రజల ఇబ్బందులపై ఆరా..*
గౌడ్ బజార్, మంగళ బజార్, సంత మార్కెట్ ఏరియా, వడ్డెర బజార్, దొంతికుంట, అంబేద్కర్ నగర్, చిన్నంశెట్టి బజార్, నిమ్మల బజార్, తూర్పు బజార్, మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్న ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
*అధికారులను ఇంకా విస్తృత సేవలు అందించాలని కోరిన ప్రమోద్..*
వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలని, డ్రైనేజీలను తక్షణమే శుభ్రం చేయాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత మున్సిపల్ అధికారులు, సిబ్బందినీ కోరారు.
భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసినప్పుడు ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపడతామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల యువ నాయకులు జూపల్లి ప్రమోద్, కౌన్సిలర్ మిండా హరిబాబు, దండా బత్తుల రమేష్,పసుపులేటి ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట