BREAKING
గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కంటెంట్‌ను నమ్ముకుని బరిలోకి 'మాయలేడి'.. నవంబర్ 13న రాకేష్ వర్రే కొత్త సినిమా విడుదల! బాలల దినోత్సవం కానుకగా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’.. తారే జమీన్ పర్ తరహాలో అద్భుత చిత్రం! తెలంగాణలో 10+2 విద్యా విధానం అమలుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు నవంబర్ రేసు నుంచి తప్పుకున్న చిత్రాలు.. విడుదలకు ఒక్కరోజు ముందే 'అ' మూవీ వాయిదా! విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి పెద్దపల్లి డిసిపి భూక్య రాంరెడ్డి ఆజాద్ బాటలో విద్యాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం - మైనార్టీ నాయకులు కోర్టు వివాదాలు క్లియర్: ఈ నెల 26న ఏపీలో 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 'ఆదర్శ కుటుంబం' హీరోయిన్ గ్లామరస్ ఫోటోలు.. నెట్టింట వైరల్! వెబ్ సిరీస్ కోసం గుండుతో కనిపించనున్న హుమా ఖురేషి.. అసలు కారణం వెల్లడించిన ప్రముఖ నటి! శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలకు పరిశోధనలు దోహదం చేయాలి – ప్రముఖ విద్యావేత్తలు - కళాశాలలో జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభం ఆస్కార్‌ రేసులో 'పైర్‌' సినిమా.. స్వతంత్ర ఎంట్రీగా నామినేషన్ దాఖలు చేసిన దర్శకుడు వినోద్ కాప్రీ! కొచెల్లా వేదికపై మరోసారి దిల్జిత్ దోసాంజ్ సంచలనం.. హెడ్‌లైన్లుగా మడోన్నా, దువా లిపా! సూర్య సినిమా లీక్ వార్తలపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన చెందానంటూ షాకింగ్ కామెంట్స్! నా కెరీర్‌లోనే ఇది అద్భుతమైన సంవత్సరం.. ప్రముఖ నటి దివ్య దత్తా సంచలన వ్యాఖ్యలు!

ఉమ్మడి కౌటాల మండలంలో తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు

Select Suryaa Now
ఉమ్మడి కౌటాల మండలంలో తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు

 

• లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్యకు నిరసనగా సీఎం నివాస ముట్టడి పిలుపు.. 

• నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసుల చర్యలు

సూర్య, కౌటాల :

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో కౌటాల మండలంలో పోలీసులు తెలంగాణ ఉద్యమకారులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ, లక్ష్మణ్ గౌడ్ మరణానికి నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించాలని ఉద్యమకారులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేపడుతున్నరు. ఇదే క్రమంలో కొటాల మండలంలోనూ తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులు నేడు తమ హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలవారీ పెన్షన్, గుర్తింపు కార్డులు, ఆరోగ్య భద్రత వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమకారుల సమస్యలపై చర్చించి పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం, నిరసనలకు సిద్ధమైన వారిని ముందస్తుగా అరెస్టు చేయడంపై ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ఈ కార్యక్రమంలో ఉద్యమ కారులు నాగపురే బండు పటేల్, చారి గోవిందరావు, దాగం ఆగయ్య, బుర్సా నాగయ్య, గొంగలే సాయినాథ్, కట్ల జగదీష్, మోరేశ్వర్, కుకుడ్కర్ రమేష్, బొమ్మ రమేష్ గౌడ్, బిట్టుపల్లి దుర్గయ్య, బాసబోయిన కేదారి, ఇల్ములే నాందేవ్, తదితర మలిదశ నాయకులు పాల్గొన్నారు.