BREAKING
ఏడేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికిన రియాలిటీ స్టార్: విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన జెన్ అఫ్లెక్ నికోలస్ పూరన్ రీ-ఎంట్రీ? రామాయణంలో సీతమ్మగా సాయిపల్లవి అద్భుత అభినయం: దైవిక రూపంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న లేడీ నటి సారా, ఇబ్రహీంలతో అనుబంధానికి కారణం కరీనానే: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక వ్యాఖ్యలు రెస్క్యూ సిబ్బందికి సీఎం అభినందనలు కట్టంగూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు.. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి: తహసీల్దార్ పుష్పలత ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన ఔషధాలను వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) భవనంలో నిల్వ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. దశదిన కర్మకు హాజరై బియ్యం,నగదు అందజేసి మానవత్వం చాటుకున్న సర్పంచ్ మురళీకృష్ణ గౌడ్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడిని కలిసిన శాపురం నర్సింహా రెడ్డి పోలింగ్ కేంద్రంలో 'తల్లికి వందనం' పోస్టర్లు.. అధికారుల తీరుపై విమర్శలు* రామాయణం మూవీ రివ్యూ: నితీశ్ తివారీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, యశ్ నటించిన విజువల్ వండర్ ఎలా ఉంది? అగ్గు ఎర్రన్న అకాల మరణం బాధాకరం: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి కాంగ్రెస్ కార్యకర్త పాడె మోసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లావ్యాప్తంగా ఎన్నికల సరళిపై పర్యవేక్షణ ఉమ్మడి కౌటాల మండలంలో తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు

రెస్క్యూ సిబ్బందికి సీఎం అభినందనలు

Select Suryaa Now
రెస్క్యూ సిబ్బందికి సీఎం అభినందనలు
ఖమ్మం/హైదరాబాద్:ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో ఎదురైన క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించి, రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతం చేసిన ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF), అగ్నిమాపక సిబ్బందితో పాటు జిల్లా అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్న బేతుపల్లి చెరువులో నీటి ఉధృతి పెరగడంతో మొదట కొందరు మత్స్యకారులు గల్లంతయ్యారు. వారిని రక్షించేందుకు నీటిలోకి వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది కూడా అనుకోని ప్రమాదంలో చిక్కుకుపోయారు. ఈ క్లిష్ట సమయంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ సహాయక బృందాలు, జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి సమన్వయంతో శ్రమించి మత్స్యకారులతో పాటు సిబ్బంది అందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి.

ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రదర్శించిన ధైర్యసాహసాలు, అంకితభావం ప్రశంసనీయమని ముఖ్యమంత్రి కొనియాడారు. సహాయక చర్యలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించిన ఖమ్మం జిల్లా కలెక్టర్‌తో పాటు పర్యవేక్షించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కృషిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.