కాంగ్రెస్ కార్యకర్త పాడె మోసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
సూర్య పెగడపల్లి :పెగడపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు వడ్లూరి ప్రవీణ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రవీణ్ కుమార్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.అనంతరం నిర్వహించిన ప్రవీణ్ కుమార్ అంతిమయాత్రలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వయంగా పాడె మోశారు. అలాగే అంత్యక్రియలు, దహన సంస్కారాల కార్యక్రమంలో పాల్గొని తుది వీడ్కోలు పలికారు.వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు