అగ్గు ఎర్రన్న అకాల మరణం బాధాకరం: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
సూర్య మోపాల్ :మోపాల్ మండల కేంద్రానికి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు అగ్గు ఎర్రన్న అక్రమ మరణం అత్యంత బాధాకరమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే గురువారం వారి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటామని.. ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన ఎర్రన్న సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన లేని లోటు తీరనిది అన్నారు. కాగా ఆయన మరణానంతరం ఆయన శరీరాన్ని ఆసుపత్రికి వైద్య విద్యార్థులకు పరిశోధన నిమిత్తం అందించడం చాలా గొప్ప విషయమన్నారు. ఇది ఎంతోమందికి ఆదర్శమన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మోపాల్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిరెడ్డి, రవి, కమ్యూనిస్ట్ నాయకులు పాపయ్య తదితరులు పాల్గొన్నారు.