BREAKING
*నేడే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓట్ల నమోదుకు చివరి తేదీ* 'రాకీ బాల్బోవా' తో అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చిన సిల్వెస్టర్ స్టాలిన్ ప్రశాంతమైన రాంచ్ జీవితాన్ని ఎంచుకున్న నటుడు టామ్ వెల్లింగ్ దాశరథికి మహేష్ కుమార్ గౌడ్ నివాళి పాప్ రారాజు మైకెల్ జాక్సన్ రియల్ ఎస్టేట్ ప్రయాణం వెల్దుర్తిలో ఓటర్లకు తప్పని తిప్పలు: స్లిప్పులు పంపిణీ చేయకపోవడంతో అయోమయం కంబోడియా నుంచి ప్రాన్స్ వరకు ఆస్తులను విస్తరిస్తున్న ఆంజెలీనా జోలీ మూడవసారి తండ్రయిన హాలీవుడ్ నటుడు జేమీ ఫాక్స్ కిమ్ కర్దాషియన్ తన బ్యూటీ బ్రాండ్ ఆసక్తికరమైన కథ కర్నూలు జిల్లాలో రిగ్గింగ్ కలకలం: పోలింగ్ నిలిపివేసిన అధికారులు జేమ్స్ బాండ్ చిత్రాలలో తన పాత్ర మరణానికి డేనియల్ క్రెయిగ్ కారణమన్న జూడి డెంచ్ 'అవెంజర్స్: డూమ్స్‌డే' లో తన పాత్రకు జపనీస్ డబ్బింగ్ చెప్పే నటుడిని స్వయంగా ప్రకటించిన రాబర్ట్ డౌనీ జూనియర్ రంజీ ట్రోఫీ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన తమిళనాడు క్రికెటర్ అజిత్ రామ్ స్థానిక గెలుపు అసెంబ్లీకి సంకేతమా? టాలీవుడ్‌పై రాధికా ఆప్టే అనుచిత వ్యాఖ్యలు: నటి పాయల్ రాజ్‌పుత్ సంచలన కౌంటర్

వెల్దుర్తిలో ఓటర్లకు తప్పని తిప్పలు: స్లిప్పులు పంపిణీ చేయకపోవడంతో అయోమయం

Select Suryaa Now
వెల్దుర్తిలో ఓటర్లకు తప్పని తిప్పలు: స్లిప్పులు పంపిణీ చేయకపోవడంతో అయోమయం

వెల్దుర్తి, న్యూస్‌టుడే: మండలంలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికారుల అసంపూర్తి ఏర్పాట్లు ఓటర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. మండల వ్యాప్తంగా ఓటర్లకు ముందస్తుగా ఇవ్వాల్సిన 'ఓటర్ స్లిప్పులు' పంపిణీ చేయకపోవడంతో పోలింగ్ రోజున ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.

సొంతంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న గ్రామీణులకు ఓటర్ స్లిప్పులు లేకపోవడంతో తమ ఓటు ఏ కేంద్రంలో ఉందో, ఓటర్ జాబితాలో తమ వరుస సంఖ్య ఏదో తెలియక గంటల తరబడి ఎండలో నిలబడాల్సి వచ్చింది. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న అధికారులు కూడా స్లిప్పులు ఇవ్వకపోగా, ఓటు వేయడానికి వచ్చిన వారిని "ఆధార్ కార్డులు తీసుకురండి" అని చెప్పి తిప్పి పంపడంతో ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దూర ప్రాంతాల నుండి ఓటు వేయడానికి వచ్చిన కార్మికులు, వృద్ధులు, మహిళలు అధికారుల వైఖరి పట్ల తీవ్ర తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి ఓటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, కనీసం పోలింగ్ కేంద్రాల వద్దనైనా సక్రమంగా సాయం అందించే కేంద్రాలను (హెల్ప్ డెస్క్) ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆరోపించారు.