andhrapradesh
అన్నమయ్య జిల్లాలో …ఘర్షణ, బ్యాలెట్ బాక్స్‌లు ధ్వంసం
అన్నమయ్య జిల్లా:అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం లక్ష్మిరెడ్డి పల్లి పోలింగ్ కేంద్రం వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీ నాయకులు మరియు కార్యకర్తల మధ్య హఠాత్తుగా ఘర్షణ ప్రారంభమైంది.
ఇరువర్గాలు పరస్పరం దాడికి దిగడంతో పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో కొందరు అల్లరిమూకలు పోలింగ్ బూత్‌లోకి దూసుకెళ్లి బ్యాలెట్ బాక్స్‌లను లాక్కొచ్చి బయట పడేయడంతో బ్యాలెట్ పత్రాలు చెల్లాచెదురయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రం వద్ద అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చిన అధికారులు నిలిచిపోయిన ఓటింగ్ ప్రక్రియను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.