వందేళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగించుకున్న వేకుల భాగ్యమ్మ
వత్సవాయి: వయసు వందేళ్లు దాటినా ప్రజాస్వామ్యంపై తన బాధ్యతను మరువలేదు వేకుల భాగ్యమ్మ. వత్సవాయిలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 100 ఏళ్ల వయసున్న వేకుల భాగ్యమ్మ పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వయసు మీద పడినా ఓటు వేసేందుకు వచ్చిన ఆమెను చూసి పలువురు అభినందించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను చాటిచెప్పిన వేకుల భాగ్యమ్మ అందరికీ ఆదర్శంగా నిలిచారు.