వరి కొయ్యలు కాల్చితే భూసారం నాశనం.. బయో డీసీతో కుళ్లిస్తే నేలకు సేంద్రియ సంపద – రైతులకు నూక సైదులు
నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో రైతులకు సూచన వరి కోతల అనంతరం పొలాల్లో మిగిలిపోయే వరి కొయ్యలను కొందరు రైతులు తగులబెడుతుండటంతో భూమి సారవంతం తగ్గడంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోంది. వరి కొయ్యలను కాల్చడం వల్ల నేలలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించడంతో పాటు భూమికి అవసరమైన సేంద్రియ పదార్థాలు కూడా తగ్గిపోతాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారుఈ సమస్యకు పరిష్కారంగా బయో డీసీ (BIO-DC) వినియోగం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నూక సైదులు సూచించారు. ఎకరానికి ఒక కిలో బయో డీసీ వినియోగించడం ద్వారా వరి కొయ్యలు వేగంగా కుళ్లిపోయి నేలలో కలిసిపోయేందుకు దోహదపడుతుందని తెలిపారు. పంట అవశేషాలు సేంద్రియ పదార్థంగా మారి భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడతాయని పేర్కొన్నారు.
రైతులు పంట అవశేషాలను తగులబెట్టే పద్ధతికి స్వస్తి పలికి, బయో డీసీ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించాలని కోరారు. భూమి సారాన్ని కాపాడుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి రైతు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.వరి కొయ్యలు రైతులకు వ్యర్థం కాదు.. భూమికి సేంద్రియ సంపద. కాల్చవద్దు.. కుళ్లించండి.. భూసారాన్ని కాపాడండి అని నూక సైదులు పిలుపునిచ్చారు.