కంబోడియా నుంచి ప్రాన్స్ వరకు ఆస్తులను విస్తరిస్తున్న ఆంజెలీనా జోలీ
హాలీవుడ్ ప్రముఖ నటి ఆంజెలీనా జోలీ తన విభిన్నమైన మరియు విలువైన ఆస్తులతో ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2003లో కంబోడియాలో ఒక సంప్రదాయ గృహాన్ని కొనుగోలు చేయడం ద్వారా ప్రారంభమైన ఆమె ఆస్తుల ప్రయాణం, ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ ప్రాంతాలకు విస్తరించింది. తన పెద్ద కుమారుడు మ్యాడాక్స్‌ను దత్తత తీసుకున్న తర్వాత కంబోడియా గ్రామీణ ప్రాంతంలో ఆమె ఈ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ ప్రాంతంతో ఆమెకు ప్రత్యేక భావోద్వేగ అనుబంధం ఉంది.
లాస్ ఏంజిల్స్ లోని ప్రముఖ దర్శక దిగ్గజం సెసిల్ బి. డెమిల్ కి చెందిన ఒక చారిత్రాత్మక బంగ్లాను 2017లో ఆమె సొంతం చేసుకున్నారు. దాదాపు 24.5 మిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన ఈ భారీ నివాసం, బ్రాడ్ పిట్ తో విడిపోయిన తర్వాత ఆమె కుటుంబానికి ప్రధాన నివాసంగా మారింది. అయితే ఇటీవలే ఈ చారిత్రక ఆస్తిని ఆమె అమ్మకానికి పెట్టి వేరొకరికి విక్రయించారు.
మరొక వైపు, ఫ్రాన్స్ లోని ప్రొవెన్స్ ప్రాంతంలో ఉన్న 'షాతో మిరావల్' అనే భారీ ఎస్టేట్ ఆమె పోర్ట్‌ఫోలియోలో అత్యంత వివాదాస్పద ఆస్తిగా మారింది. 2012లో బ్రాడ్ పిట్‌తో కలిసి కొనుగోలు చేసిన ఈ 1,200 ఎకరాల వైన్ యార్డ్ ఆస్తిలోని తన వాటాను ఆమె వేరొక సంస్థకు విక్రయించడం, దానిపై బ్రాడ్ పిట్ న్యాయపోరాటం చేయడం వల్ల ఇది నిరంతరం వార్తల్లో నిలుస్తోంది.
వీటితో పాటు న్యూయార్క్ నగరంలోని మ్యాన్ హ్యాటన్ ప్రాంతంలో ఆమెకు సొంత అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. గతంలో న్యూ ఓర్లియన్స్ లోని ఫ్రాన్స్ క్వార్టర్ భవనం, బెవర్లీ హిల్స్ నివాసాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక లగ్జరీ ఇళ్లను ఆమె వినియోగించారు. కంబోడియాలో పర్యావరణ పరిరక్షణ కోసం స్థాపించిన ఫౌండేషన్ సహా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ ఆస్తులు ఆమె వ్యక్తిగత మరియు వ్యాపార ప్రయాణానికి అద్దం పడుతున్నాయి.