అధికారికంగా చేరని ఓటర్ స్లిప్పులు
పూసపాటిరేగ, సూర్య : అధికారిక తప్పిదం వలన మండలంలో జరిగిన ప్రాదేశిక ఎన్నికలకు ఓటర్ స్లిప్పులు బి ఎల్ వో లు సకాలంలో అంద చేయకపోవడంతో ఓటర్లు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఉదయం 7 గంటలకే గ్రామాల్లో ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైనప్పటికీ బి ఎల్ వో ల అందజేయాల్సిన స్లిప్పులు ఓటర్లకు చేరకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో చాలావరకు ఓటర్లు పార్టీల ఎన్నికల శిబిరాల వద్దకు వెళ్లి వాటర్ స్లిప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మండల కేంద్రమైన పూసపాటిరేగ తో పాటు చోడమ్మ అగ్రహారం, కొప్పెర్ల, కోనాడ గ్రామాలతో పాటు మత్స్యకార గ్రామాలకు కూడా అధికారక ఓటర్ స్లిప్పులు వి ఎల్ వో లు వారికి కేటాయించిన గ్రామాలలో ఇంటింటికి పంపిణీ చేయకపోవడం వలన ఓటర్ జాబితాలో తమ ఓటు ఉందో లేదో తెలియని పరిస్థితి తో పాటు పోలింగ్ కేంద్రాలలో కూడా నానా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు పలువురు ఓటర్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎంపీడీవో రాధికను మాత్రం ఈ విషయమై ప్రస్తావించగా రెండు రోజులు ముందే ఓటర్ స్లిప్పులను బి ఎల్ వో లకు అందజేయడం జరిగిందని స్పష్టం చేయగా, బి ఎల్ వోలు మాత్రం తక్కువ సమయం ఉండడంతో పాటు ఎన్నికల విధుల్లో ఇతరత్రా పనులను కూడా తమకే అప్పగించడం వలన పూర్తిస్థాయిలో అధికారిక ఓటర్ స్లిప్పులను అందజేయలేకపోయినట్లు బిఎల్వోలు పేర్కొన్నారు.