BREAKING
ఓటు హక్కును వినియోగించుకున్నడబ్బిరు ఆదిలక్ష్మి దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న మెట్రో రైలు వ్యవస్థ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటీకరణ ను టెండర్లు తక్షణమే నిలిపివేయాలి రూ.1100 కోట్లకు పైగా విలువైన ఆస్తుల నగదీకరణకు అంతర మంత్రిత్వ శాఖ సిఫార్సు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపు. ఘనంగా జనసేన విజయ కేతనం ర్యాలీ ప్రశాంతంగా చీరాల, వేటపాలెంలో ముగిసిన పోలింగ్ దర్శి లో వెళ్లివేసిన ఆధ్యాత్మికత శోభ. బిజెపి పార్టీ బలోపేతం కు సమిష్టిగా కృషి చెయ్యండి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ టీడీపీ - బీజేపీ శ్రేణుల మధ్య రాళ్లదాడి వాతావరణ మార్పుల అనుకూల నిధుల్లో తీవ్ర అంతరం ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన అబ్జర్వర్ అధికారికంగా చేరని ఓటర్ స్లిప్పులు అధికారులు, ఎస్ఈసీ మాఫియాలా మారారు.. పాలకొండ డిగ్రీ కళాశాలలో రిసెప్షన్ మరియు స్ట్రాంగ్ రూమ్ కేంద్రం తనిఖీ

పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపు. ఘనంగా జనసేన విజయ కేతనం ర్యాలీ

Select Suryaa Now
పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపు.  ఘనంగా జనసేన విజయ కేతనం ర్యాలీ

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   నెల్లూరు నగరంలోని 21వ డివిజన్‌లో కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయం సాధించిన వీర మహిళ  గునుకుల విజయలక్ష్మి  ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక గుర్రాలమడుగు సంఘం నుంచి విజయ కేతనం ర్యాలీ ఘనంగా నిర్వహించారు.  తనను ఆదరించి, ఆశీర్వదించి, ఓట్లు వేసి కార్పొరేటర్‌గా గెలిపించిన 21వ డివిజన్ ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలియజేస్తూ విజయలక్ష్మి ర్యాలీ ద్వారా ప్రజలను నేరుగా కలుసుకున్నారు.  ఈ సందర్భంగా ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఓటరుకు, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కూటమి శ్రేణులకు విజయలక్ష్మి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  ఈ ర్యాలీలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ చైర్‌పర్సన్, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ గారి సతీమణి శ్రీమతి అనురాధ గారు, జనసేన నాయకులు కిషోర్ గునుకుల గారితో పాటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో కార్పొరేటర్‌గా అవకాశం కల్పించిన ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని, డివిజన్ అభివృద్ధికి కూటమి నాయకుల సహకారంతో కట్టుబడి ఉంటానని తెలిపారు. ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన కూటమి నాయకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.