BREAKING
దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న మెట్రో రైలు వ్యవస్థ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటీకరణ ను టెండర్లు తక్షణమే నిలిపివేయాలి రూ.1100 కోట్లకు పైగా విలువైన ఆస్తుల నగదీకరణకు అంతర మంత్రిత్వ శాఖ సిఫార్సు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపు. ఘనంగా జనసేన విజయ కేతనం ర్యాలీ ప్రశాంతంగా చీరాల, వేటపాలెంలో ముగిసిన పోలింగ్ దర్శి లో వెళ్లివేసిన ఆధ్యాత్మికత శోభ. బిజెపి పార్టీ బలోపేతం కు సమిష్టిగా కృషి చెయ్యండి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ టీడీపీ - బీజేపీ శ్రేణుల మధ్య రాళ్లదాడి వాతావరణ మార్పుల అనుకూల నిధుల్లో తీవ్ర అంతరం ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన అబ్జర్వర్ అధికారికంగా చేరని ఓటర్ స్లిప్పులు అధికారులు, ఎస్ఈసీ మాఫియాలా మారారు.. పాలకొండ డిగ్రీ కళాశాలలో రిసెప్షన్ మరియు స్ట్రాంగ్ రూమ్ కేంద్రం తనిఖీ బంగాళాఖాతంలో వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పరిశోధన నెట్‌వర్క్ ప్రారంభం

టీడీపీ - బీజేపీ శ్రేణుల మధ్య రాళ్లదాడి

Select Suryaa Now
టీడీపీ - బీజేపీ శ్రేణుల మధ్య రాళ్లదాడి

కర్నూలు :కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ ఏజెంట్ నియమకానికి సంబంధించిన విషయంలో ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం పార్టీ (టీడీపీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుల మధ్య తీవ్ర విభేదాలు భగ్గుమన్నాయి.

బూత్‌లోకి వెళ్తున్న ఏజెంట్ విషయంలో బీజేపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ వర్గానికి, టీడీపీ నాయకుడు హంపయ్య వర్గానికి మధ్య తొలుత తీవ్ర వాగ్వాదం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఒకరిపై ఒకరు కారంపొడి చల్లుకుంటూ దాడులు చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

ఈ హింసాత్మక ఘర్షణల్లో ఇరువర్గాలకు చెందిన దాదాపు 20 మంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదనపు బలగాలను మోహరించి గ్రామంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.