BREAKING
ఓటు హక్కును వినియోగించుకున్నడబ్బిరు ఆదిలక్ష్మి దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న మెట్రో రైలు వ్యవస్థ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటీకరణ ను టెండర్లు తక్షణమే నిలిపివేయాలి రూ.1100 కోట్లకు పైగా విలువైన ఆస్తుల నగదీకరణకు అంతర మంత్రిత్వ శాఖ సిఫార్సు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపు. ఘనంగా జనసేన విజయ కేతనం ర్యాలీ ప్రశాంతంగా చీరాల, వేటపాలెంలో ముగిసిన పోలింగ్ దర్శి లో వెళ్లివేసిన ఆధ్యాత్మికత శోభ. బిజెపి పార్టీ బలోపేతం కు సమిష్టిగా కృషి చెయ్యండి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ టీడీపీ - బీజేపీ శ్రేణుల మధ్య రాళ్లదాడి వాతావరణ మార్పుల అనుకూల నిధుల్లో తీవ్ర అంతరం ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన అబ్జర్వర్ అధికారికంగా చేరని ఓటర్ స్లిప్పులు అధికారులు, ఎస్ఈసీ మాఫియాలా మారారు.. పాలకొండ డిగ్రీ కళాశాలలో రిసెప్షన్ మరియు స్ట్రాంగ్ రూమ్ కేంద్రం తనిఖీ

పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటీకరణ ను టెండర్లు తక్షణమే నిలిపివేయాలి

Select Suryaa Now
పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటీకరణ ను టెండర్లు తక్షణమే నిలిపివేయాలి

విశాఖపట్నం, సూర్య : విశాఖపట్నం పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్‌ను ప్రైవేటీకరించే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని, పోర్ట్ యాజమాన్యం తన సొంత నిధులతోనే ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని విశాఖపట్నం పోర్ట్ అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.  మధ్యాహ్నం పోర్ట్ చైర్మన్ కార్యాలయం (AOB) వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న సీఐటీయూ గౌరవ అధ్యక్షులు వి.ఎస్. పద్మనాభ రాజు మాట్లాడుతూ, గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ అనేది కేవలం ఒక ఆసుపత్రి మాత్రమే కాదని, పోర్టులో పనిచేస్తున్న ప్రస్తుత అధికారులు, కార్మికులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, సీహెచ్‌డీ కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఎన్నో సంవత్సరాలుగా ఆరోగ్య భరోసా కల్పిస్తున్న ప్రజా వైద్య సంస్థ అని పేర్కొన్నారు.

సుమారు 40 వేల మంది కార్మికులు, ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది, వారి కుటుంబాలకు ఉపయోగపడుతున్న ఈ ఆసుపత్రిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు పోర్ట్ యాజమాన్యం ప్రయత్నించడం అన్యాయమని విమర్శించారు. గతంలో పీపీపీ విధానంలో ఆసుపత్రిని ప్రైవేటీకరించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు 532 రోజుల పాటు నిరంతర పోరాటం నిర్వహించాయని గుర్తుచేశారు. కార్మికుల ఐక్య పోరాట ఫలితంగా అప్పట్లో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే మళ్లీ ఇప్పుడు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం కార్మికవర్గాన్ని మోసం చేయడమేనని అన్నారు. ఈ అంశంపై గౌరవ హైకోర్టులో న్యాయపోరాటం కొనసాగుతున్నప్పటికీ, నవంబర్ 6న టెండర్లు తెరవడానికి పోర్ట్ యాజమాన్యం ప్రయత్నించడం కోర్టు విచారణను, కార్మికుల ఆందోళనలను పట్టించుకోకపోవడమేనని విమర్శించారు.

ఆసుపత్రి అభివృద్ధి పేరుతో 1.21 ఎకరాల ఆసుపత్రి స్థలంతో పాటు చుట్టుపక్కల ఉన్న 4.7 ఎకరాల భూమిని కలిపి మొత్తం 5.91 ఎకరాల విలువైన పోర్టు భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల ఆదాయం, వేల కోట్ల రూపాయల రిజర్వు నిధులు కలిగిన పోర్ట్ యాజమాన్యానికి తన ఆసుపత్రిని అభివృద్ధి చేసుకునే ఆర్థిక సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థలకు భూములు, నిర్వహణ అప్పగించకుండా పోర్ట్ సొంత నిధులతోనే దశలవారీగా ఆసుపత్రిని ఆధునికీకరించాలని డిమాండ్ చేశారు. అవసరమైన వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించి, ఆధునిక వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు.

కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసు, రీజనల్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చలు, హైకోర్టులో కొనసాగుతున్న న్యాయపోరాటం అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని టెండర్ల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పోర్ట్ యాజమాన్యం ఇప్పటికైనా తన మొండి వైఖరిని విడనాడి ఆసుపత్రి ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని, లేనిపక్షంలో ప్రస్తుత కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను ఐక్యం చేసి మరింత ఉధృతమైన ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ నాయకులు పొతన్న, హెచ్‌ఎంఎస్ నాయకులు అంజి, మంగయ్య నాయుడు సీఐటీయూ నాయకులు సత్యనారాయణ, ఈశ్వరరావు జగన్ సీఐఎఫ్‌టీయూఐ కనకరావు, బీఎంఎస్ సురేష్ వీడీఎల్‌బీ లక్ష్మణరావు తదితర కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు, పోర్టు కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదించారు.