BREAKING
దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న మెట్రో రైలు వ్యవస్థ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటీకరణ ను టెండర్లు తక్షణమే నిలిపివేయాలి రూ.1100 కోట్లకు పైగా విలువైన ఆస్తుల నగదీకరణకు అంతర మంత్రిత్వ శాఖ సిఫార్సు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపు. ఘనంగా జనసేన విజయ కేతనం ర్యాలీ ప్రశాంతంగా చీరాల, వేటపాలెంలో ముగిసిన పోలింగ్ దర్శి లో వెళ్లివేసిన ఆధ్యాత్మికత శోభ. బిజెపి పార్టీ బలోపేతం కు సమిష్టిగా కృషి చెయ్యండి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ టీడీపీ - బీజేపీ శ్రేణుల మధ్య రాళ్లదాడి వాతావరణ మార్పుల అనుకూల నిధుల్లో తీవ్ర అంతరం ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన అబ్జర్వర్ అధికారికంగా చేరని ఓటర్ స్లిప్పులు అధికారులు, ఎస్ఈసీ మాఫియాలా మారారు.. పాలకొండ డిగ్రీ కళాశాలలో రిసెప్షన్ మరియు స్ట్రాంగ్ రూమ్ కేంద్రం తనిఖీ బంగాళాఖాతంలో వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పరిశోధన నెట్‌వర్క్ ప్రారంభం

అధికారులు, ఎస్ఈసీ మాఫియాలా మారారు..

Select Suryaa Now
అధికారులు, ఎస్ఈసీ మాఫియాలా మారారు..

అమరావతి :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వంపై, ఎన్నికల అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు) అందరూ ఒక మాఫియాలా తయారై ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తొత్తుగా మారి, ఈ ఎన్నికల అక్రమాలకు తెరలేపిందని మండిపడ్డారు.

పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేకపోవడం వల్లే ఈ అక్రమాలకు ఒడిగట్టారని జగన్ ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీకి చెందిన పలువురు నేతలను, అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. పోలింగ్ రోజున బూత్‌లలోకి దౌర్జన్యంగా చొచ్చుకెళ్లి రిగ్గింగ్ చేసిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయని తెలిపారు. అలాగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో కూడా తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయనీయకుండా అడ్డుకున్నారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.