BREAKING
విద్యావేత్త విశ్రాంత ఉపాధ్యాయుడు మృతి...... కేటీఆర్‌ను కలిసిన కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ బాణాసంచాలను కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి...... ఇందిరమ్మ లబ్ధిదారులతో కాంగ్రెస్ నాయకుల సంబరాలు దత్తాత్రేయ స్వామి, లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు మెడికల్ షాపులపై సస్పెన్షన్లు ఎత్తివేయాలి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.. ఉక్రెయిన్ భద్రతా సంస్థ ఎస్‌బీయూపై జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం సంప్రదాయ కుమ్మరి కళాకారులకు చేయూత తాగునీటిని వృథా చేస్తే కఠిన చర్యలు జలమండలి అధికారుల పిలుపు వెలిమెలలో తాగునీటి సమస్యకు పరిష్కారం నేషనల్ ఫుట్బాల్ గేమ్ సెలెక్ట్ అయిన గిరిజన విద్యార్థిని శైలజ ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి క్షేత్రస్థాయి పర్యటన విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం.!

పాలకొండ డిగ్రీ కళాశాలలో రిసెప్షన్ మరియు స్ట్రాంగ్ రూమ్ కేంద్రం తనిఖీ

Select Suryaa Now
పాలకొండ డిగ్రీ కళాశాలలో రిసెప్షన్ మరియు స్ట్రాంగ్ రూమ్ కేంద్రం తనిఖీ

పాలకొండ, సూర్య :  పాలకొండ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల రిసెప్షన్ మరియు స్ట్రాంగ్ రూమ్ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాద్ ,  పాలకొండ, వీరఘట్టం ఎంపీడీఓలు మరియు పాలకొండ తహశీల్దార్‌ రాద కృష్ణ మూర్తి తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల విధులు ముగించుకుని వచ్చే సిబ్బంది నుండి ఎన్నికల సామగ్రి స్వీకరణకు చేపట్టిన ఏర్పాట్లను, స్ట్రాంగ్ రూమ్‌లో భద్రతా ఏర్పాట్లను మరియు ఇతర మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎన్నికల సామగ్రి స్వీకరణ ప్రక్రియ సజావుగా నిర్వహించేలా, స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.