BREAKING
తెలంగాణ మత్స్య రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలిః కేంద్రమంత్రికి మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికార యంత్రాంగానికి ప్రశంసలు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న తొండపు దశరథ జనార్దన్ 40 ఏళ్లుగా భీమవరంలో నివాసం.. అయినా ఓటు హక్కు లేదు! గతంలో ఓటు వేసిన వ్యక్తికి ప్రస్తుత ఓటరు జాబితాలో పేరు గల్లంతు యాపిల్ ఉద్యోగుల ఏఐ ఖర్చులపై కోత: రోజువారీ బడ్జెట్‌లో భారీ తగ్గింపు గుడి నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదు! ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి 60% గ్రాంట్ ఇవ్వాలిః కేంద్ర మంత్రికి ఎంపీ ఆర్‌.కృష్ణయ్య విజ్ఞప్తి ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లో ఇక డిజిటల్ పారదర్శకత!అదనపు కలెక్టర్ నగేష్ ప్రభుత్వ లాంఛనాలతో డాక్టర్ బాబ్జి అంత్యక్రియలు. భూముల రీ-సర్వేలో అవినీతికి తావుండకూడదు!అదనపు కలెక్టర్ నగేష్ 'ఖేతీ బచావో అభియాన్'తో రైతులకు అవగాహన.. మహిళా సంఘాలు వ్యాపార కేంద్రాలుగా ఎదగాలి. డీఆర్డీఓ ఉమాహారతి చోటా షకీల్ బావమరిది ఆస్తులను జప్తు చేసిన ఈడీ ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మనోప్రియ.. చిన్నారి వైద్య ఖర్చుల కోసం రూ.13,330 ఆర్థికసాయం.. బ్రాహ్మణపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

తెలంగాణ మత్స్య రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలిః కేంద్రమంత్రికి మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి

Select Suryaa Now
తెలంగాణ మత్స్య రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలిః కేంద్రమంత్రికి మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః తెలంగాణ రాష్ట్రంలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు మత్స్యకారుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌ఎప్‌డిబి) ద్వారా కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌ఎప్‌డిబి) పాలక మండలి సమావేశంలో మంత్రి పాల్గొని తెలంగాణ రాష్ట్ర మత్స్య రంగ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్రానికి గోదావరి, కృష్ణా వంటి రెండు ప్రధాన జీవనదులతో పాటు అనేక రిజర్వాయర్లు, చెరువులు, ఇతర జలవనరులు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ జలవనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. మత్స్యకార సహకార సంఘాలను మరింత బలోపేతం చేయాలని, మత్స్యకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, ఆర్థిక సహాయం అందించాలని కోరారు. చేపల ఉత్పత్తి పెంపుతో పాటు వాటి నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న చేపలను ఇతర రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం కోల్డ్ స్టోరేజ్‌లు, చేపల ప్రాసెసింగ్ యూనిట్లు, ఆధునిక రవాణా సదుపాయాలు, ఎగుమతులకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకు ఎన్‌ఎప్‌డిబి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. దీనివల్ల మత్స్యకారులకు తమ ఉత్పత్తులకు మెరుగైన ధర లభించడంతో పాటు రాష్ట్రానికి ఆదాయం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ముఖ్యంగా ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మత్స్య రంగంపై ఆధారపడిన కుటుంబాలు ఉపాధి, ఆదాయం కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి రాకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కు మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రత్యేక సహాయక ప్యాకేజీ, తగిన పరిహారం అందించాలని కోరారు. మత్స్యకారుల సంక్షేమం, మత్స్య రంగ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎప్‌డిబి ద్వారా అవసరమైన నిధులు, సాంకేతిక సహకారం, మౌలిక సదుపాయాలు కల్పిస్తే తెలంగాణ మత్స్య రంగం మరింత అభివృద్ధి చెందడంతో పాటు మత్స్యకార కుటుంబాలకు స్థిరమైన ఉపాధి, మెరుగైన జీవన ప్రమాణాలు అందుతాయని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.