BREAKING
తెలంగాణ మత్స్య రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలిః కేంద్రమంత్రికి మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికార యంత్రాంగానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ప్రశంసలు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న తొండపు దశరథ జనార్దన్ 40 ఏళ్లుగా భీమవరంలో నివాసం.. అయినా ఓటు హక్కు లేదు! గతంలో ఓటు వేసిన వ్యక్తికి ప్రస్తుత ఓటరు జాబితాలో పేరు గల్లంతు యాపిల్ ఉద్యోగుల ఏఐ ఖర్చులపై కోత: రోజువారీ బడ్జెట్‌లో భారీ తగ్గింపు గుడి నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదు! ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి 60% గ్రాంట్ ఇవ్వాలిః కేంద్ర మంత్రికి ఎంపీ ఆర్‌.కృష్ణయ్య విజ్ఞప్తి ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లో ఇక డిజిటల్ పారదర్శకత!అదనపు కలెక్టర్ నగేష్ ప్రభుత్వ లాంఛనాలతో డాక్టర్ బాబ్జి అంత్యక్రియలు. భూముల రీ-సర్వేలో అవినీతికి తావుండకూడదు!అదనపు కలెక్టర్ నగేష్ 'ఖేతీ బచావో అభియాన్'తో రైతులకు అవగాహన.. మహిళా సంఘాలు వ్యాపార కేంద్రాలుగా ఎదగాలి. డీఆర్డీఓ ఉమాహారతి చోటా షకీల్ బావమరిది ఆస్తులను జప్తు చేసిన ఈడీ ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మనోప్రియ.. చిన్నారి వైద్య ఖర్చుల కోసం రూ.13,330 ఆర్థికసాయం.. బ్రాహ్మణపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

గుడి నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదు!

Select Suryaa Now
గుడి నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదు!

సంగారెడ్డి, : గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని గడ్డపోతారం గ్రామంలో నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ పనులను అధికారులు నిలిపివేయడంపై కాంగ్రెస్ పార్టీ పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణ పనులను నిలిపివేయడం సరికాదని స్పష్టం చేశారు.ఈ మేరకు ఆయన సంఘటన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, స్థానికులు, ఆలయ నిర్వాహకులతో మాట్లాడి సమస్యకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు సంబంధించిన ఆలయ నిర్మాణ పనులను అధికారులు అర్ధంతరంగా నిలిపివేయడంపై ఆరా తీశారు.అనంతరం మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడిన కాట శ్రీనివాస్ గౌడ్.. గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం చేపడుతుంటే పనులను నిలిపివేయడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొన్నారు. గతంలో గ్రామ పంచాయతీ ఆమోదించిన తీర్మానాలు, అనుమతి పత్రాలు స్పష్టంగా ఉన్నప్పటికీ అధికారులు అనవసరంగా ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు.

భక్తుల మనోభావాలను గౌరవించాలి

ఆలయ నిర్మాణ పనులను నిలిపివేయడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొంటూ, సంబంధిత అధికారులు సమస్యను సానుకూలంగా పరిశీలించాలని కోరారు. తక్షణమే గుడి నిర్మాణ పనులు తిరిగి కొనసాగించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు.