BREAKING
తెలంగాణ మత్స్య రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలిః కేంద్రమంత్రికి మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికార యంత్రాంగానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ప్రశంసలు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న తొండపు దశరథ జనార్దన్ 40 ఏళ్లుగా భీమవరంలో నివాసం.. అయినా ఓటు హక్కు లేదు! గతంలో ఓటు వేసిన వ్యక్తికి ప్రస్తుత ఓటరు జాబితాలో పేరు గల్లంతు యాపిల్ ఉద్యోగుల ఏఐ ఖర్చులపై కోత: రోజువారీ బడ్జెట్‌లో భారీ తగ్గింపు గుడి నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదు! ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి 60% గ్రాంట్ ఇవ్వాలిః కేంద్ర మంత్రికి ఎంపీ ఆర్‌.కృష్ణయ్య విజ్ఞప్తి ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లో ఇక డిజిటల్ పారదర్శకత!అదనపు కలెక్టర్ నగేష్ ప్రభుత్వ లాంఛనాలతో డాక్టర్ బాబ్జి అంత్యక్రియలు. భూముల రీ-సర్వేలో అవినీతికి తావుండకూడదు!అదనపు కలెక్టర్ నగేష్ 'ఖేతీ బచావో అభియాన్'తో రైతులకు అవగాహన.. మహిళా సంఘాలు వ్యాపార కేంద్రాలుగా ఎదగాలి. డీఆర్డీఓ ఉమాహారతి చోటా షకీల్ బావమరిది ఆస్తులను జప్తు చేసిన ఈడీ ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మనోప్రియ.. చిన్నారి వైద్య ఖర్చుల కోసం రూ.13,330 ఆర్థికసాయం.. బ్రాహ్మణపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి 60% గ్రాంట్ ఇవ్వాలిః కేంద్ర మంత్రికి ఎంపీ ఆర్‌.కృష్ణయ్య విజ్ఞప్తి

Select Suryaa Now
ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి 60% గ్రాంట్ ఇవ్వాలిః కేంద్ర మంత్రికి ఎంపీ ఆర్‌.కృష్ణయ్య విజ్ఞప్తి

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఫీజుల రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాలకు కేంద్ర ప్రభుత్వం 60% గ్రాంట్ నిధులు ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య మంత్రి నివాసంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు పూర్తి ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేస్తుంది. ఈ పథకం కింద కాలేజీ కోర్సులో ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సులు మరియు డిగ్రీ, పీజీ కోర్సులు చదువుచున్న రెండు రాష్ట్రాలలో 30 లక్షల మందికి ఉచిత విద్య ఇస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 60% నిధులు గ్రాంట్ కింద ఇస్తుంది. ఇదే మాదిరిగా బీసీ, ఈబీసీ విద్యార్థులకు కూడా 60% నిధులు గ్రాంట్ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల సరిపోక నిధులు లేక తెలంగాణ 8,500 కోట్లు, ఆంధ్రాలో 9,000 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. దీని మూలంగా విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కోర్సు పూర్తి అయిన వారు దాదాపు నాలుగు లక్షల మంది ప్రభుత్వం మంజూరు చేయలేక విద్యార్థులు ఫీజులు కట్టలేక సర్టిఫికెట్లు కాలేజీలో ఉండిపోయాయి. కేంద్ర ప్రభుత్వం సానుభూతితో ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న మాదిరిగా బీసీలకు 60% గ్రాంట్ ఇవ్వాలని కోరారు.
ఈ ఫీజుల రీయింబర్స్మెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగా దేశంలో ఎక్కడా లేదు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అన్ని రాష్ట్రాలలో ఈ పథకం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను ఆదేశించాలని కోరారు. బీసీ గురుకుల భవనాలకు నిర్మాణానికి బడ్జెట్ ఇవ్వాలి. తెలంగాణలో 325 బీసీ గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఇందులో మంచి విద్యా ప్రమాణాలు గల విద్యను అందిస్తున్నారు. ఇటీవల ఎస్సెస్సీ ఇంటర్ పబ్లిక్ పరీక్షలలో 99% ఫలితాలు వచ్చాయి. కానీ 325 బీసీ గురుకులాలలో ఒక్కదానికి సొంత భవనం లేదు. వీటి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ పాఠశాలలలో చాలీచాలని వసతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పాఠశాల భవనాల నిర్మాణానికి సమగ్ర శిక్షా అభియాన్ కింద నిధులు ఇవ్వాలని కోరారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో హామీ :
బీసీ గురుకుల పాఠశాలల మంచి విద్యా ప్రమాణాలు ఉన్నాయని స్పందించి సమగ్ర శిక్షా అభియాన్ కింద నిధులు మంజూరు చేయడానికి తగిన ప్రతిపాదనలు గ్రాండ్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫీజుల రీయింబర్సమెంట్ పథకముకు కేంద్ర సామాజిక న్యాయ శాఖను పరిశీలించవలసినదిగా సూచించారు. ఐఐటి, ఐఐఎం కోర్సు లు చదివే వారికి పూర్తి ఫీజులు ఇచ్చే ప్రతిపాదన ఉందన్నారు. ఈ ప్రతినిధి వర్గంలో బిసి నాయకులు సిద్దప్ప యాదవ్, వెంకటేష్, హరీష్, యాదగిరి, లాల్ కృష్ణ, హనుమంతు, ఆశిష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.