BREAKING
తెలంగాణ మత్స్య రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాలిః కేంద్రమంత్రికి మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికార యంత్రాంగానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ప్రశంసలు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న తొండపు దశరథ జనార్దన్ 40 ఏళ్లుగా భీమవరంలో నివాసం.. అయినా ఓటు హక్కు లేదు! గతంలో ఓటు వేసిన వ్యక్తికి ప్రస్తుత ఓటరు జాబితాలో పేరు గల్లంతు యాపిల్ ఉద్యోగుల ఏఐ ఖర్చులపై కోత: రోజువారీ బడ్జెట్‌లో భారీ తగ్గింపు గుడి నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదు! ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి 60% గ్రాంట్ ఇవ్వాలిః కేంద్ర మంత్రికి ఎంపీ ఆర్‌.కృష్ణయ్య విజ్ఞప్తి ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లో ఇక డిజిటల్ పారదర్శకత!అదనపు కలెక్టర్ నగేష్ ప్రభుత్వ లాంఛనాలతో డాక్టర్ బాబ్జి అంత్యక్రియలు. భూముల రీ-సర్వేలో అవినీతికి తావుండకూడదు!అదనపు కలెక్టర్ నగేష్ 'ఖేతీ బచావో అభియాన్'తో రైతులకు అవగాహన.. మహిళా సంఘాలు వ్యాపార కేంద్రాలుగా ఎదగాలి. డీఆర్డీఓ ఉమాహారతి చోటా షకీల్ బావమరిది ఆస్తులను జప్తు చేసిన ఈడీ ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మనోప్రియ.. చిన్నారి వైద్య ఖర్చుల కోసం రూ.13,330 ఆర్థికసాయం.. బ్రాహ్మణపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మనోప్రియ.. చిన్నారి వైద్య ఖర్చుల కోసం రూ.13,330 ఆర్థికసాయం..

Select Suryaa Now
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మనోప్రియ..   చిన్నారి వైద్య ఖర్చుల కోసం రూ.13,330 ఆర్థికసాయం..

(అనంతపురం, కార్పొరేషన్ మేజర్ న్యూస్:)

ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు శివప్రియ వెల్ఫేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, మోటివేషనల్ స్పీకర్ మనోప్రియ. కష్టాల్లో ఉన్నామని ఎవరైనా ఆప్యాయంగా అమ్మా అని పిలిచి సహాయం కోరితే తన వంతు సాయం అందించేందుకు ముందుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
తాజాగా మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఓ చిన్నారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచారు. బుధవారం అనంతపురం నగరంలో శివప్రియ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్ మనోప్రియ ఆధ్వర్యంలో, ఫౌండేషన్ సభ్యురాలు రమాదేవి, హైదరాబాద్‌కు చెందిన సైకాలజిస్ట్ డాక్టర్ శాంతిముత్యాలుతో కలిసి చిన్నారి కుటుంబానికి రూ.13,330 ఆర్థికసాయం అందజేశారు.ఈ సందర్భంగా మనోప్రియ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న కుటుంబాలకు తమ వంతు సహాయం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దాతలు ముందుకు వచ్చి ఆ కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు.ఇప్పటివరకు ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వందలాది మంది ఆపదలో ఉన్నవారికి తన వంతుగా సహాయం అందిస్తూ మనోప్రియ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ప్రచారం కోసం కాకుండా మానవత్వంతో చేసే ఈ సేవలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి.మనోప్రియ చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల ఆమెతో పనిచేసే ఉద్యోగులు, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు, నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఉన్న చిన్నారి కుటుంబానికి మరింతమంది దాతలు అండగా నిలవాలని వారు కోరుతున్నారు.సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు స్పందించే హృదయమే నిజమైన మానవత్వం.. మనోప్రియ సేవా స్ఫూర్తి మరెందరికో ఆదర్శం కావాలి.