వత్సవాయి జెడ్పీహెచ్‌ఎస్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఐపీఎస్ అధికారి బి. లక్ష్మీనారాయణ
ఎన్టీఆర్ జిల్లా, వత్సవాయి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఐపీఎస్ అధికారి బి. లక్ష్మీనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఎన్నికల విధుల్లో వాలంటీర్లుగా సేవలందిస్తున్న వారిని అభినందించి, వారి సేవలను ప్రశంసించారు. ఎన్నికల నిర్వహణలో సహకరిస్తున్న సిబ్బంది, వాలంటీర్లకు ఆయన అభినందనలు తెలియజేశారు.