BREAKING
వత్సవాయి జెడ్పీహెచ్‌ఎస్‌ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఐపీఎస్ అధికారి బి. లక్ష్మీనారాయణ రేపు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓట్ల నమోదుకు చివరి తేదీ* ప్రజాస్వామ్యం ఖూనీ..కస్సుమన్నజగన్ బీసీలకు కేటాయించిన భూములు..బలహీన వర్గాల ఆస్తులుః మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఉమ్మడి బెజ్జుర్ మండలంలో తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలి. -దేవాలయ కమిటీ చైర్మన్ కావలి లక్ష్మయ్య. భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు: 2,000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ కాకినాడ జిల్లాలో కూటమి, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ సొంత సమాధి నిర్మించుకున్న హాలీవుడ్ నటుడు నికోలస్ కేజ్ 'రాకీ బాల్బోవా' తో అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చిన సిల్వెస్టర్ స్టాలిన్ ప్రశాంతమైన రాంచ్ జీవితాన్ని ఎంచుకున్న నటుడు టామ్ వెల్లింగ్ దాశరథికి మహేష్ కుమార్ గౌడ్ నివాళి పాప్ రారాజు మైకెల్ జాక్సన్ రియల్ ఎస్టేట్ ప్రయాణం వెల్దుర్తిలో ఓటర్లకు తప్పని తిప్పలు: స్లిప్పులు పంపిణీ చేయకపోవడంతో అయోమయం కంబోడియా నుంచి ప్రాన్స్ వరకు ఆస్తులను విస్తరిస్తున్న ఆంజెలీనా జోలీ

ప్రజాస్వామ్యం ఖూనీ..కస్సుమన్నజగన్

Select Suryaa Now
ప్రజాస్వామ్యం ఖూనీ..కస్సుమన్నజగన్
అమరావతి:రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల పోలింగ్ ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందని, ఎన్నికల ప్రక్రియ అంతా తీవ్ర అక్రమాలు, అరాచకాలమయంగా మారిందని ఆయన ఆరోపించారు.స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అధికార కూటమి పూర్తిగా కబ్జా చేసిందని, ప్రతిపక్ష అభ్యర్థులకు చెందిన పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి రానివ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారని జగన్ విమర్శించారు. నామినేషన్ల ఘట్టం నుంచి మొదలైన దౌర్జన్యాలు పోలింగ్ రోజున మరింత పరాకాష్టకు చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల్లో కూటమి నాయకులు బహిరంగంగా రిగ్గింగ్, దొంగ ఓట్లకు పాల్పడుతుంటే పోలీసులు, ఎన్నికల యంత్రాంగం నిష్క్రియాపరత్వంతో వ్యవహరించాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదు. అసలు వీటిని ఎన్నికలు అని అనగలమా? దేశ చరిత్రలోనే ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చోటుచేసుకోలేదు" అని జగన్ మండిపడ్డారు.

కూటమి అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తక్షణమే జోక్యం చేసుకుని అక్రమాలు జరిగిన పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌ను రద్దు చేసి రీ-పోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.