రేపు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓట్ల నమోదుకు చివరి తేదీ*
ఐజ సూర్య న్యూస్* పల్లెపల్లెలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓట్ల నమోదు
ఎక్లాస్‌పురం, దేవబండ తదితర గ్రామాల్లో పర్యటిస్తూ డిగ్రీ పూర్తయిన అర్హులందరూ ఎమ్మెల్సీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపు.జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓట్ల నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా అయిజ మండలంలోని ఎక్లాస్‌పురం, దేవబండ తదితర గ్రామాల్లో బీజేపీ నాయకులు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ అయిజ మండల అధ్యక్షులు గోపాలకృష్ణ గ్రామాల్లో తిరుగుతూ అర్హులైన పట్టభద్రులకు ఓటు నమోదు ఫారాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన పట్టభద్రులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఓటు నమోదుకు కేవలం ఒక్క రోజు మాత్రమే గడువు ఉందని అంటే నేటితో గడువు ముగుస్తుంది అని స్పష్టం చేశారు. కుటుంబంలో డిగ్రీ పూర్తయి మూడేళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు కోసం ఎన్‌రోల్మెంట్ చేసుకోవాలని సూచించారు. గడచిన ఎన్నికలలో ఓటు వేసిన వారు సైతం ఈసారి విధిగా మళ్లీ నమోదు చేసుకోవాలని తెలిపారు. ఓటు నమోదు కోసం డిగ్రీ మెమో, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్ జిరాక్స్ కాపీలతో పాటు చిన్న పాస్‌పోర్ట్ సైజు ఫోటోను అందజేసి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దెబ్బకు దరఖాస్తు చేసుకోవాలని, ఎవరూ కాలయాపన చేయవద్దని కోరారు. ప్రభుత్వ వైఫల్యాలపై మండిపడుతూ.. గతంలో బీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశాయని ఆరోపించారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు సరిగ్గా అందక తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అరకొర నోటిఫికేషన్లతో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా యువతను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే మార్చి నెలలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో సరైన నాయకుడిని ఎన్నుకుని, ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అయిజ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు బోయ రామకృష్ణ, బూత్ అధ్యక్షులు కురువ శివన్న, తిరుమలేష్, వెంకటన్న, మునిస్వామి, నితిన్, శ్రీనివాసులు మరియు పలువురు పట్టభద్రులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
*ఐజ మండలం సూర్య రిపోర్టర్ వి ఆనందరాజు*