ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలి. -దేవాలయ కమిటీ చైర్మన్ కావలి లక్ష్మయ్య.
కొందుర్గు (రంగారెడ్డి): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ కావలి లక్ష్మయ్య కోరారు గురువారం ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం లో స్వామివారికి విశేష అభిషేకం, అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమాలతో పాటు స్వామివారి ఉత్సవ విగ్రహానికి పల్లకి సేవను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం దేవాలయ కమిటీ చైర్మన్ కావలి లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రతి ఏకాదశికి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో ఒత్తిడికి గురవుతున్నారని, ఆ ఒత్తిడిని తగ్గించుకునేందుకు గాను ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని, దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ధర్మకర్తలు సేరిగూడెం యాదగిరి, జి నరేందర్ గౌడ్, సి అమర్ లింగం గ్రామస్తులు కందుకంల నరసింహులు గౌడ్, కందుకంల రాములు గౌడ్, ఎం వేణుగోపాల్ గౌడ్, సి లింగం, ఎం రాఘవేందర్, ఎం నరేందర్ , ఎం రవి, వెంకటయ్య, మల్లేష్, రమేష్, రాజు, రవి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
ఈరమొల్ల సత్యనారాయణ, మేజర్ న్యూస్.