జగన్ రెడ్డి తీరువల్లే శాంతి భద్రతుల సమస్య
సూర్య న్యూస్ దర్శి.జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ అబద్ధాలు, అరాచకాలు, భయభ్రాంతుల ద్వారా ఓటర్లను మభ్యపెట్టి గెలవాలని ప్రయత్నిస్తోందని దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. గురువారం దర్శి లోని టీడీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ... అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గొడవలు సృష్టించి గెలవాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. దీనికి నిదర్శనంగా పులివెందులలోని ఎర్రిపల్లిలో బాంబు దాడుల ద్వారా ఓటర్లను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సగటు ఓటింగ్ సుమారు 22 శాతం ఉండగా, రాయలసీమ ప్రాంతాల్లో చిత్తూరు 33 శాతం, అనంతపురం 30 శాతం, కర్నూలు 30 శాతం నమోదైంది. కానీ కడపలో తక్కువ నమోదు కావడానికి వెనుక వైసీపీ, జగన్మోహన్ రెడ్డి కుట్రలే కారణమని స్పష్టం చేశారు.
ప్రజలు స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా బయటకు వచ్చి ఓటు వేస్తుంటే వారిని బాంబుల ద్వారా భయపెట్టే ప్రయత్నాలు. జరుగుతున్నాయన్నారు.
అర్బన్ లోకల్ బాడీస్‌లో కూటమికి వచ్చిన భారీ ఫలితాలు (సుమారు 95 శాతం స్ట్రైక్ రేట్) జెడ్పిటిసి-ఎంపిటిసి ఎన్నికల్లో కూడా పునరావృతమవుతాయనే భయంతో వైసీపీ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారాలు మానుకోవాలి. ప్రజల తీర్పును గౌరవించాలి. విద్వేషం, హింస ద్వారా ఓట్లు గెలవాలనుకుంటే ప్రజలు సహించరు. కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేస్తున్నారు. అదే నమ్మకాన్ని కొనసాగిస్తూ ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టుకుంటామని డాక్టర్ లక్ష్మీ అన్నారు.
దర్శి నియోజకవర్గంలో కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతుంటే వైసీపీ సైకోమోకలు గొడవలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు. కూటమి నాయకులు కార్యకర్తలు అప్రమత్తతో ఉండి విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని డాక్టర్ లక్ష్మీ పిలుపునిచ్చారు.