జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికార యంత్రాంగానికి ప్రశంసలు
ఖమ్మం సూర్య (మేజర్ న్యూస్): సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వద్ద అధికార యంత్రాంగం ప్రదర్శించిన సమర్ధవంతమైన సమన్వయం ,అప్రమత్తత,విజయవంతమైన రక్షణ చర్యలను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, భారీ వర్షాలు ,వరదలతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న నెలకొన్న వేళ ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం సిబ్బంది సేవలు మరువలేనివని అన్నారు.బేతుపల్లి చెరువు ఉప్పొంగిన ప్రాంతంతో పాటు దమ్మపేట మండలంలో పలు గ్రామాలకు ముప్పు ఏర్పడిన సమయంలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తక్షణమే స్పందించి చేపట్టిన చర్యలను అభినందించారు. అదే విధంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రతి గురువారం ప్రజావాణి నిర్వహిస్తున్నామని ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని అదే విధంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించామని అన్నారు. ఈనాటి ప్రజావాణిలో 38 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఈ దరఖాస్తులను జిల్లా మంత్రులు ,శాసనసభ సభ్యులు,అధికారులతో కలిసి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.